Lele baba niddura levayya hd video with shiridi sai baba original pics

Опубликовано: 31 Май 2026
на канале: AKRUTHI
3,714,456
8.9k

బాబా ను నిద్దుర లేపుతూ ఆరాధనగా పాడుకున్న పాట..
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతియై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమైన బాబా ను
లే లే బాబా నిద్దుర లేవయ్యా.. ఏలే స్వామి మేలుకోవయ్యా
అంటూ బాలు గారు అద్భుతంగా పాడిన ఈ గీతం ఓ అద్భుతం..
video created by : Sri Multimedia

ఆ ఆ ఆ...ఓ...ఆ...ఓ..ఆ..
లేలే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగా
తలుపు తీయరా బాబా (లేలే)
వేగుచుక్క తిలకమెట్టి
వేదమంత్ర పూలు పెట్టి...ఆ..(వేగుచుక్క)
పాదసేవ చేసుకునే వేళదాటి పోయెనని
ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ
అందుకనే గుండె నే గురుపీఠమైనది
ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బాబా(లేలే)
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నేవేనని
రూపముల ఏకములైన శ్రీ సాయివి
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే
సుఖశాంతి నెలవులై
వెన్నంటే నువ్వుంటే లోటే లేదులే(లేలే)