విద్యా రంగంలో 18 ఏళ్ళ ప్రస్థానం... 16 విద్యాలయాల ద్వారా పది వేల మంది విద్యార్థులకు విద్యాబోధన. చేస్తున్న సంస్థే జీవన జ్యోతి. ప్రొద్దుటూరులో గురుదేవ్ రామిరెడ్డి 2000 ల సంవత్సరంలో జీవనజ్యోతి విద్యా సంస్తలను ప్రారంభించారు. ఆనాడు 150 మంది విద్యార్థులతో మొదలైన ఈ స్కూల్ నేడు ప్రొద్దుటూరులోనే 9 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకుంది. తిరుపతి, జమ్మలమడుగు, యర్రగుంట్ల, రైల్వేకోడూరులలో మరిన్ని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకుని విద్యా రంగంలో దూసుకుపోతోంది. ప్రతి ఏటా ఫలితాల్లో అగ్రగామిగా ఉంటూ వస్తున్న జీవనజ్యోతి విద్యా సంస్థ ఈ ఏడు కూడా పదోతరగతి ఫలితాల్లో ముందంజలో ఉంది. ప్రొద్దుటూరులోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రొద్దుటూరు మొదలై రాయలసీమ వ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిసిన జీవనజ్యోతి విద్యా సంస్థలో విద్యా బోధనలో ఒక కొత్త వరవడిని సృష్టిస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని బ్రాంచ్‌లతో విద్య నందించేందుకు సిద్ధమైంది