Lyrics, Tune & Vocals : John Victor Punyamantula
Vocals : Rohit Anil
Music : Madhav(Maddy)
Lyrics
నా సంతోషానికి కారణం నీవే యేసయ్య
నీవే యేసయ్య నాకు సంతోషం నీవే
నా సమృద్ధికి కారణం నీవే యేసయ్య
నీవే యేసయ్య నాకు ఐశ్వర్యం నీవే ..2..
పరమును వీడి భూలోకానికి మనిషిగా వచ్చావే
మనిషిగా వచ్చావే - నన్ను రక్షించావే
నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి నన్ను కొన్నావే
నన్ను కొన్నావే - నీ సొత్తుగా చేసావే
స్తోత్రం స్తోత్రం యేసయ్య - స్తోత్రం స్తోత్రం యేసయ్య ..2..
1. కన్నీరంతా తుడిచావు కృంగిన నన్ను లేపావు
నన్నెంతో ఆదరించావే ..2..
వ్యాధి బాధలు నన్నేమి చేయవు
శోధనలెన్నున్నా నన్నేమి చేయవు ..2..
నా ధైర్యం నీవయ్యా - నా బలము నీవయ్యా ..2..
స్తోత్రం స్తోత్రం యేసయ్య - స్తోత్రం స్తోత్రం యేసయ్య ..2..
2. చీకటి నుండి విడిపించి వెలుగు నాపై కుమ్మరించి
వెలుగుగా నన్ను మార్చేవే ..2..
లోకానికి నన్ను వెలుగుగా ఉంచావే
వెలుగు ఫలములు నాలో ఉంచావే ..2..
నా జీవం నీవయ్యా - నా సర్వం నీవయ్యా ..2..
స్తోత్రం స్తోత్రం యేసయ్య - స్తోత్రం స్తోత్రం యేసయ్య ..2..