Rythu Runa Mafi | Special App to Farmers | రైతు రుణమాఫీ వర్తించనివారి వివరాల నమోదుకు ప్రత్యేక యాప్

Опубликовано: 17 Октябрь 2024
на канале: ETV Telangana
18,025
106

రుణమాఫీ పథకం వర్తించని రైతులకు సంబంధించిన తప్పుల సవరణ వేగవంతం చేయాలని...వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల వివరాల సేకరణ, బ్యాంకుల నుంచి వచ్చిన వివరాల్లో తప్పుల సవరణ వేగవంతం చేయాలని సూచించారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, సంచాలకులు గోపి టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రైతు రుణమాఫీ పథకం వర్తించని, కుటుంబ సభ్యుల నిర్థారణ జరగని వారికోసం...ప్రత్యేక యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో 2 రోజులపాటు అన్ని మండలాల్లో ట్రయల్స్ జరిపినట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ వరకు 22 లక్షల 37 వేల 848 మందికి రుణమాఫీ చేసినట్లు...వెల్లడించారు. ఇవాళ్టి నుంచి గ్రామాలవారీగా మండల వ్యవసాయ అధికారులు సమగ్రసర్వే నిర్వహిస్తారని చెప్పారు. రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా...కుటుంబసభ్యుల నిర్థారణ జరగాలని ఆదేశించారు. తప్పుగా నమోదైన లక్షా 24 వేల 604 ఆధార్ వివరాలు సంబంధిత బ్యాంకులకు సరిచేయటానికి ఇచ్చినట్లు…ఇప్పటి వరకు 41 వేల 339 ఆధార్ కార్డుల వివరాలను సరిచేయటం జరిగిందన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------