వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ సింగ్ నగర ప్రాంతాన్ని పునరుద్ధరించే వరకూ విశ్రమించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సింగ్ నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. భద్రతాసిబ్బంది వారించినా వినకుండా బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. సింగ్ నగర్‌లో గండి పూడ్చే విషయంపై... సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. బుడమేరు నీరు వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంతటి వరదను ఎన్నడూ చూడలేదని... స్థానికులు సీఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. సింగ్ నగర్ ప్రజలకు భోజనం, మంచినీరు వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. సింగ్ నగర్ ప్రాంతమంతా పూర్తిగా కోలుకునేవరకూ అక్కడే ఉంటానని సీఎం స్పష్టం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------