ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు : నిమ్మగడ్డ రమేశ్ కుమార్

Опубликовано: 30 Март 2026
на канале: VIZAG NEWS
31
0

పంచాయతీ ఎన్నికల వేళ SEC నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బిజీగా ఉన్నారు. ఇటీవల రాయలసీమలో పర్యటించిన ఆయన ఇవాళ విశాఖపట్టణం, గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా విశాఖపట్టణంతో తన పర్యటన ప్రారంభించారు.
" ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదు అని, నిబంధనలకు అనుగుణంగా జరిగితే ఇబ్బంది లేదని చెప్పారు."
పంచాయతీ ఎన్నికల కోసం 8,642 మందిని పీవో, ఏపీవోగా నియమించామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమని తెలిపారు. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్‌ చెబుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. స్వీయనియంత్రణకు కట్టుబడి ఉన్నామని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తేల్చిచెప్పారు.