*జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు*
నందిపేట్ బతుకమ్మ: నందిపేట్ మండల కేంద్రంలో గురువారం భారతదేశపు తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ యొక్క 135వ జయంతి. సందర్భంగా నెహ్రూ గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
నాయకులు మీడియా తో మాట్లాడుతూ, "పండిట్ నెహ్రూ గారికి జిల్లాతో ముఖ్యంగా మండలం తో విడదీయరాని సంబంధం ఉంది అని ఆయన హయాంలో పోచంపాడ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ఆ పిదప రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి పోతల పథకాలు పెట్టడం వలన రైతులు మంచి పంటల్ని పెట్టి రాష్ర్ట స్థాయి గుర్తింపు పొందారని గత జ్ఞాపకాల్ని గుర్తు చేశారు. ఆయన చిన్నారులను ఎంతగానో ప్రేమించే వారు కాబట్టి ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. ఈ సంద్భంగా బాల బాలికలకు బాలల దినోత్సావ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం. లో మండల అధ్యక్షుడు మంద మహిపాల్ జిల్లా కార్యదర్శి వై ఎస్ గంగాధర్, నాయకులు సిలిండర్ లింగం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.