డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రకటన విడుదలైంది. జులై 1 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించామని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు వెసులుబాటు ఇచ్చారు. జులై 22న మొదటి విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తారు. జులై 23 నుంచి 27 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు.. జులై 24 నుంచి 29 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 4న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయిస్తామని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
#NewsOfTheDay
#EtvTelangana