Priyanka Gandhi Launches Congress Manifesto for UP Polls | ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో

Опубликовано: 02 Октябрь 2024
на канале: ETV Telangana
2,006
46

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా... మేనిఫెస్టోను విడుదల చేశారు. "ఉన్నతి విధాన్ జన్ ఘోష్న పత్రా-2022" పేరుతో ఎన్నికల హామీలను ప్రకటించారు. పోలీసు, వైద్య, విద్య రంగాల్లో 12 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులతోపాటు... మరో 8 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చి మెుత్తం 20 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కొవిడ్ తో పోరులో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు 50 లక్షల పరిహారం... కరోనా ప్రభావిత కుటుంబాలకు 25 వేల ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. అనుభవం,నిబంధనలకు అనుగుణంగా తాత్కాలిక ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామని... SC, ST విద్యార్థులకు KG నుంచి PG వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో SC, ST లకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి,సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్లే పార్టీకే UP ప్రజలు అధికారాన్ని ఇస్తారని కాంగ్రెస్ విశ్వసిస్తోందని ప్రియాంక పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలతో మేనిఫెస్టో రూపొందించామని... ఇదే అభివృద్ధికి మార్గం చూపిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 403 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి రేపట్నుంచి మార్చి 7 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------