PM Modi Inaugurate Revamped Ayodhya Dham Railway Station | అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన మోదీ

Опубликовано: 29 Сентябрь 2024
на канале: ETV Telangana
9,816
110

ఉత్తర్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఆయన వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. రైల్వేస్టేషన్ వివరాలను ప్రధాని మోదీకి.... కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. 240కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన మూడు అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు వంటి అన్ని ఆధునిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచే రెండు అమృత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను కూడా పచ్చజెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్ లో 15 వేల 700 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు...అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీకి....ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ , సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో చేశారు..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------