Nama Mahima | Lalitha Devi Song

Опубликовано: 13 Июль 2026
на канале: Manasa Himaja
6,718
126

Lalitha Devi special song Nama Mahima for Dussehra celebrations

Our latest concert at Sai Dhyan Mandir , Chandler AZ .

Telugu lyrics :
=============

తాళం : చతురస్ర గతి
రాగం : హంసధ్వని

ప॥ నామ మహిమ తెలియగ రారండి - శ్రీ లలిత రహస్య ॥
1చ॥ అమృతకరము లలితా నామం - అమృత పానం లలితా గానం
త్రికాల ఙ్ఞానం త్రిగుణాతీతం - త్రిపుర సుందరిని తలచిన కలుగును ॥
2చ॥ సర్వరోగముల శమింపజేసి సర్వ సంపదలు సమకూర్చి
సహస్రనామ పారాయణులకు శ్రీ చక్రాంకిత వాసిని తెలిపెను ॥
ప॥ నామ మహిమ తెలియగ రారండి - శ్రీ లలిత రహస్య ॥

రాగం : కానడ
స్వరం : సా,ని పా,మ గా,మ రీసా | గమమద దనినిస సరిగా; సరిగా; సనిపమ గా,మ రీసా ||
3చ॥ శత్రువులందరు మిత్రులగుదురని దీనులందరును ధీరులగుదురని
శరభేశ్వరుడే శక్తినిచ్చునని శాతోదరియే శాసించెనట ॥
4చ॥ కోటి జన్మములు గంగను మునిగినా - కోటిదానములు కోరిచేసినా
కోటి లింగములు ప్రతిష్ఠించినా - సహస్ర నామ సమముకావట ॥
ప॥ నామ మహిమ తెలియగ రారండి - శ్రీ లలిత రహస్య ॥

రాగం : హంసానంది
స్వరం : సారీ గామా దానీ రీసా || ,ససని దనిదా ,నిదని మదమా || ,గరిస గమదా ,గామదనిసా ||
5చ॥ కోటి సూర్యుల కాంతి కలదని - కోటి రుద్రుల శక్తి కలదని
కోటి బ్రహ్మల సృష్టి కలదని హయగ్రీవుడే స్వయముగ తెలిపెను ॥
6చ॥ జీవితకాలమునొకమారైనా సహస్ర నామము చదివిన వారికి
భక్తి మార్గమై ప్రసరించునట - భక్తియు , ముక్తియు సమకూరునట ॥
ప॥ నామ మహిమ తెలియగ రారండి - శ్రీ లలిత రహస్య ॥

రాగం : మధ్యమావతి
స్వరం : పనిసా సాసా సనిపమ రీసా || రిరిమమ నినిరిరి సనిపమ పనిసా || ససాని పామా రీమా పాసా ||
7చ॥ లక్ష్మి శారద గౌరి రుద్రులు లక్ష్య శుధ్ధి తో లలితను కొలిచిరి
లక్ష్మీకాంతుడు నారాయణుడే లలితా కరముల ఉధ్భవించెనట ॥
8చ॥ పున్నమినాటి చంద్రుని లోన లలితాదేవిని ధ్యానము చేసి - త్రికరణ శుధ్ధిగా సహస్రనామము అనినను వినినను జన్మరహితము ॥
ప॥ నామ మహిమ తెలియగ రారండి - శ్రీ లలిత రహస్య ॥