@kuruvadasisters
Telugu Lyrics :
=============
Pallavi
|| అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||
Charanams
|| నీరిలోన తల్లడించే నీకే తలవంచీ | నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ | సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||
|| నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ | మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ | ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||
|| చక్కదనములె పెంచీ సకలము గాలదంచి | నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ | అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
English Lyrics :
=============
ammamma emamma alamelmanga nancaramma |
tammiyinta nalarukomma oyamma ||
nirilona talladince nike talavanci
nirikinda pulakinci niramanundu |
gorikona cemarinci kopame pacarinci
sareku niyaluka itte calincavamma ||
nikugane ceyyicaci nindakopamureci
mekoni nivirahana menu vencini |
ikadakadi satula hrdayame perareci
aku madiciyyanaina anatiyyavamma ||
cakkadanamule penci sakalamu galadanci
nikkapu venkatesudu nike poncini |
makkuvato alamelmanga nancaramma
akkuna natani nitte alarincavamma ||