భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో పూజ్యశ్రీ భవఘ్ని గురుదేవుల వారి సారధ్యంలో అంగరంగ వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు జరిగాయి .
శ్రీ వ్యాసదేవులవారిని ఆరామం నుండి రథంలో పూజ్యశ్రీ గురుదేవులవారు, అమ్మ, వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పూర్ణకుంభముతో, శిష్య సమేతంగా వ్యాస గాయత్రి మంత్రంతో ఊరేగింపుతో మేళతాళాలు మధ్య ధర్మక్షేత్ర ప్రాంగణానికి మంగళ హారతితో ఆహ్వానించడం జరిగింది.
శ్రీమద్భగవద్గీత, విష్ణు సహస్ర నామం అఖండ పారాయణం నిర్విరామంగా జరుగుతూ ఉంది.
ధర్మక్షేత్రానికి కొత్తగా వచ్చిన దంపతులు శ్రీ వ్యాస భగవనులవారి విగ్రహా మూర్తులకు స్వయంగా తమ స్వ హస్తాలతో వ్యాస అష్టోత్తర శతనామావళి నామాలతో ప్రేమతో ఆరాధన చేసుకోవడం జరిగింది.
#gurupurnima #guru #happygurupurnima #guruji #india #teacher #love #blessings #gurudev #yoga #instagram #meditation #bhavaghni #spiritual #vyasadharmakshetram #purnima #peace #hinduism #gurupoornima #vyasamaharshi #VedaVyasa #enlightenment #gurujiblessings #mumbai #Vyasapoornima #teachers #vichar #satguru #sadhguru #spiritualawakening