కృష్ణా జిల్లాకి కాళరాత్రిని మిగిల్చిన దివిసీమ ఉప్పెన || diviseema uppena

Опубликовано: 15 Июль 2026
на канале: Vidmahe
363,270
4.9k

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న, సారవంతమైన ద్వీపం దివిసీమ. రెండువైపులా కృష్ణా నది, ఒక వైపు సముద్రం ఉండే త్రిభుజాకారపు ప్రాంతం. nov-19కి కొన్నిరోజులముందే అంటే 14-nov-1977 నే జరగబోయే విలయానికి అంకురార్పణ జరిగింది. అండామాన్ నికోబార్ ద్వీపాల సమీపంలో ప్రాణంపోసుకున్న తుఫాన్, పశ్చిమంగా ప్రయాణించి మధ్యలో తన డిశను మార్చుకుని చెన్నై తీరరేఖ సమీపంలోంచి ఆంధ్రా సముద్రజలాల్లోకి ప్రవేశించిది.
మొదట్లో కొద్ది కొద్ది గా కురుస్తున్న వర్షం చూడడానికి ఆహ్లాదకరంగానే ఉంది. కానీ క్రమేపీ వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. సాధారణ వాన జోరువానగా, భారీవర్షంగా, అతిభారీవర్షంగా మారిపోతూ ఊర్లలో రోడ్లు జలమయం అయిపోసాగాయి. రేడియోల్లో తుఫాను హెచ్చరికలు మొదలయ్యాయి.
Nov-18 నుండీ 3 రోజులు జిల్లాలోని అన్ని స్కూళ్ళని మూసివేస్తున్నట్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఒంగోలు-కాకినాడ తీరప్రాతాలమధ్య కేంద్రీకృతమెయి ఉంది తుఫాను. అది ఎప్పుడైనా ఎక్కడైన తీరందాటవచ్చని కనుక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేడియోల్లో హెచ్చరికలు మొదలయ్యాయి.
కానీ దివిసీమ లాంటి తీరప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలకి ఇలాంటి తుఫాను హెచ్చరికలు సాధారణమే. అందుకనే మొదట్లో ఆ హెచ్చరికల్ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. అక్టోబర్-నవంబర్ మాసాల్లో సాధారణంగా వినిపించే తుఫాను హెచ్చరికల్లాంటిదే ఇది అని అత్యధికులు భావించారు.
కానీ మధాహ్నం 2 గంటల సమయంలో ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు విపరీతమైన వేగంతో సముద్రంవైపు వెళ్ళడం దివిసీమ తీరప్రాంత ప్రజలు గమనించారు. సాధారణంగా నీరునింపుకుని ఉన్న నల్లని మేఘాలు ఆకాశంలో భారంగా కదులుతాయి.
కానీ ఇవి అతివేగంగా దాదాపుగా 100 మైళ్ళ వేగంతో సముద్రంవైపు కదలడం కొందరిలో భయాన్ని కలిగించింది. కానీ ఏమీకాదులే అనే మొండి ధైర్యం కొందరిని, అపటికే మొదలైన భీభత్సమైన వర్షం మరికొందరిని ఇళ్ళు దాటనివ్వకుండాచేశాయి.

Music: https://www.bensound.com/
Source help: నెమలికన్ను బ్లాగ్ (http://nemalikannu.blogspot.com/)