#SarvaiPapanna దక్షిణభారతదేశంలో #Moghal సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కత్తిపట్టిన తొలివీరుడతను. పుట్టింది అతిసాధారణ కల్లుగీసేకుటుంబంలో. కానీ పరిస్థితుల ప్రభావం అతనితో కత్తిపట్టించింది. అన్యాయానికి ఎదురుతిరిగే అతని నైజం ఔరంగజేబునే ఒకడుగు వెనక్కి వేసేలా చేసింది.
అతని మొండితనం గోల్కొండ ఖిల్లానే అతని పరం చేసింది. అతనే తెలంగాణా శివాజీ గా పేరుతెచ్చుకున్న #SardarSarvaipapanna. ఇతడు మహారాష్ట్ర సిమ్హం శివాజీ మహరాజ్(#ShivajiMaharaj) కి సమకాలీకుడు అని అతని చరిత్ర పరిశోధనచేసినవాళ్ళు చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఇద్దరూ కూడా హిందువులమీద అత్యాచారాలు చేస్తున్న ముస్లిం పాలకులమీద యుద్ధం చేశారు.
ముఖ్యంగా పాపన్న, ఢిల్లీపాలకులపైనే కాకుండా, ప్రజలను ఇబ్బందిపెడుతున్న దొరల, జమిందారులపై కూడా దాడులు చేసి వారికి వ్యతిరేకంగా బలహీన వర్గాలన్నిటినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చి సైన్యాన్ని నిర్మించాడు.
పాపన్న నేటి తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో ఆగష్టు 18, 1650 నాడు గౌడ (#Goud) కులంలో జన్మించాడు. తల్లి తండ్రులు, సర్వమ్మ, ధర్మన్న గౌడ్. ధర్మన్న గౌడ్, పాపన్న చిన్న తనంలోనే చనిపోయాడు.తల్లి సర్వమ్మకు ఒక్కకొడుకు కావడంతో గారాబంగా పెంచింది.
పాపన్న ఎల్లమ్మ (#Ellamma)దేవతకు పరమ భక్తుడు, పరమ శివుణ్ణి కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. అయితే పాపన్నకి కుటుంబనేపధ్యంలో వచ్చిన కల్లుగీత వృత్తిపై అంతగా ఇష్టం లేదు. కేవలం తన తల్లి కోరికమీద మాత్రమే ఆవృత్తిని స్వీకరించాడు. ఒక వయసువచ్చేవరకూ, కల్లుగీయడం, పశువులను మేపడం వంటి కుల సాంప్రదాయ జీవితాన్నే గడిపాడు పాపన్న.
#sardar #sarvayi #papanna #goud #telanganahero #sardarsarvayipapannagoud #papannagoud #sardarpapanna #sarvaipapanna #historypapanna #history #goudhistory #goudpapannacharitra #goudcharitra #charitra #papannacharitra #telugu #biographies #papannabiographyintelugu #biographyintelugu #biographyoffamouspeopleintelugu #lifestoryoffamouspeople #papannalifehistory #successstory #unknownfactspapanna #sardarsarvaipapannagoudinformation #sardarsarvaipapannagoudbiography #golcondafort #golkondaforthistory #secretsofgolcondafort #golcondastorytelugu #golcondavideo ##గీతా_వృత్తి_దారుల_ఆవేదన