మాజీ మావోయిస్టు, మాజీ టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు సాంబశివుడి వర్ధంతిని భువనగిరి లో ఘనంగా జరుపుకున్నారు.
వాయిస్ ఓవర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా:- భువనగిరి లో అమరవీరుల స్థూపం వద్ద సాంబశివుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వర్థంతి ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు శెట్టి బాలయ్య యాదవ్ మాట్లాడుతూ. బడుగుబలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సాంబశివుడు మావోయిస్టు పార్టీలో చేరారని అన్నారు. తను లొంగిపోయాక తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు టిఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులు గా చేరారని అన్నారు. ఆయన జీవితమే త్యాగాలతో కూడిన జీవితం అని అన్నారు. నిజాయితీ, నిబద్దత గల వ్యక్తి సాంబశివుడు అని అన్నారు.ఆయన చెప్పిన మాటలు, త్యాగం, తెగువ ఎప్పుడూ గుర్తుంచుకోవాలని తెలిపారు. ఆయన నిరంతరం సమాజం కోసం ఆలోచిచేవాడని, అలాంటి నాయకుడిని కోల్పోవడం విచారకరమని తెలిపారు. ఆయన మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలు , ఆలోచనలు ప్రజల మధ్యలో స్థిరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నక్క చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
బైట్: బాలయ్య యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు